కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి

_ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా హనుమకొండలో కాలోజి కళాక్షేత్రం ప్రారంభం

ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం

ఆర్ట్ గ్యాలరీ సందర్శన

కాళోజి పై నిర్మించిన లగు చిత్రన్ని విక్షించిన ముఖ్యమంత్రి

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన
స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్, నవంబర్ 19:
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఇవాళ ప్రారంభిం చడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయకపోగా, అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్న వారి కాళ్లలో కట్టెలు పెడుతోందన్నారు. కెసిఆర్ చేసిన అప్పులకు వేలకోట్లలో వడ్డీ కష్టమని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తి ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదని, ఊచలు లెక్కపెట్ట వలసిం దేనని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని భూములు అమ్ముకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణను మద్యంలో, మత్తులో ముంచి ప్రజలకు వివేకం లేకుండా చేయాలనుకు న్నారు. మద్యం ఏరులై పారించి తెలంగాణలో ఆడపడుచులకు అన్యా యం చేయాలనుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహిళలు అభివృద్ధి చెందడం కెసిఆర్ కు ఇష్టం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల అభివృద్ధికి బాటలు వేసి వారిని పురు షాధిక్య ప్రపంచం నుండి స్వేచ్ఛను కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి ప్రణాళికు రచించి, పర్యవేక్షించాల్సిన బాధ్యతలు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించామన్నారు. ఆ బాధ్యతలను ఆయన నెత్తినేసుకుని పూర్తి చేసేపనిలో ఉన్నారని మంత్రి పొంగులేటిని అభినందించారు.

తెలంగాణ ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇదే… ఏం రేవంత్ రెడ్డి.

స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది. 2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు. ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్ తెలిపారు. ఇదే కాకుండా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు. ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతోందని అన్నారు. పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్విని రెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే అని ఆయన తెలిపారు. అనేక మంది మహిళా అధికారులు పలు జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా ఓ మహిళలే ఉందని సీఎం చెప్పుకొచ్చారు. వారి రుణం ఇంకా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!