
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా… ముదిరాజ్ గుండెల్లో చైతన్య ఎజెండా అంటూ మొట్టమొదటిసారిగా “ముదిరాజులే మత్స్యకారులు” అనే నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21, 2014 నాడు ఆవిర్భవించిన సంఘమే తెలంగాణ ముదిరాజ్ మహాసభ అని ముదిరాజ్ మహాసభ అధ్యక్షురాలు బండారి లావణ్యముదిరాజ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ గొడుగు సమ్మయ్యముదిరాజ్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ మండల కేంద్రంలో మహాసభ పోస్టరు ఆవిష్కరించారు. ఆ సంఘం ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రభుత్వంను మెప్పించి, ఒప్పించి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిన సంఘం తెలంగాణ ముదిరాజ్ మహాసభ అన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో, జిల్లా కేంద్రము రాష్ట్ర కేంద్రంలో ముదిరాజు జెండా ఎగురవేస్తూ, ర్యాలీ సంబరాలతో తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షురాలు బండారి లావణ్యముదిరాజ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ గొడుగు సమ్మయ్య ముదిరాజ్, మహాసభ హుజురాబాద్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు ఈర్ల కావ్యముదిరాజ్, డైరెక్టర్ గొడుగు రాజశేఖర్, చెల్పూరు ముదిరాజ్ మహాసభ అద్యక్షులు బండారి శ్రీనివాస్, రాజపల్లి మహాసభ అద్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్, గంట రాజేందర్, ఈర్ల స్రవంతి, ఈర్ల సాయి, రాజేందర్, బిక్షపతి, గొడుగు కవిత, గొడుగు రాజమణి, వనమాల కోమల, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
