
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వరంగల్ రైతుసంఘం కార్యాలయంలో ఈనెల 25న జరిగిన పత్తి రైతుల రాష్ట్ర సదస్సులో రాష్ట్ర కో కన్వీనర్ గా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన చెల్పూరి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడు శోభన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చెల్పూరి రాము మాట్లాడుతూ నా పైన నమ్మకం పెట్టుకొని నన్ను పత్తి రైతుల రాష్ట్ర కోకన్వీనర్ గా ఎన్నుకున్నందుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కి మరియు మూడు శోభన్ కి వివిధ జిల్లాల పత్తి రైతులకు ప్రతినిధులకు ప్రత్యేక విప్లవ వందనాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై పత్తి క్వింటాల్ కు రూ.7,521/- కనీస మద్దతు ధరను అమలు చేయాలని, ఎన్నికల బోనస్ హామి పత్తి క్వింటాల్ కు రూ.475 చెల్లించాలని, తేమ శాతం పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు అన్నారు. వానాకాలం, యాసంగి పంటలకు రైతు భరోసా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న రూ.2 లక్షల రైతు రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేసేంతవరకు రైతుల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలపై రైతాంగ పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.
