
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఇన్నోవేషన్ మారథాన్ 2024- 25 సంవత్సరంలో శాస్త్ర సాంకేతిక రంగంలో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ షష్టేనేబుల్ డెవలప్మెంట్ విభాగాలలో ప్రాజెక్టు పూర్తిచేసి సర్టిఫికెట్స్ పొందారని, వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి తిరుమల సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. వీరికి గైడ్ టీచర్స్ గా స్కూల్ అసిస్టెంట్లు ఎం మాధవిలత, పీ శ్రావణి లు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు తిరుమల మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆలోచనలతో సృజనాత్మకత పెంపొందించుకొని కొత్త విషయాలను తెలుసుకుంటూ అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్స్ ను మరియు విద్యార్థులను అమే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆసియా, రోజారాణి, పీ ఈశ్వర్ రెడ్డి, అర్చన, మారుతి, ప్రసాద్, రాములు, జమున, రాణి, శోభారాణి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
