మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను అర్థరాత్రి 11 గంటల సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందనీ, నేడు పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి సమావేశం ఉండడంతో మా దళితులను టార్గెట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దుర్మార్గ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడాన్ని తక్షణమే ఆపాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైనా న్యాయబద్ధంగా బతకడానికి హక్కు ఉన్న ఈ భారతదేశంలో, ఇలాంటి అన్యాయాలకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలి. లేదంటే ప్రజల తరఫున ఆందోళన చేయడం తప్ప మరో మార్గం ఉండదు…ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.