
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆద్వర్యంలో హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రెండవ విడత దళిత బంధు నిధులు విడుదలపై హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొదటగా అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి సియం రేవంత్ రెడ్డి మరియు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, పార్టీ జిల్లా ఇంఛార్జి కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ బాబు చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ దలితులు అందరూ ఎల్లా వేళలా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు అని యూత్ కాంగ్రెస్ నాయకుడు చల్లూరి రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

