
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని రెండవ వార్డులో గల గణేష్ నగర్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి సందర్శించారు. అనంతరం స్థానికులు అక్కడున్న పరిస్థితులను, సమస్యలను ప్రణవ్ కు వివరించారు. డ్రైనేజ్, త్రాగు నీరు సమస్య ఉందని వివరించగా వెంటనే సంభంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా కాలనీలో ఉంటున్న వారికి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






గణేష్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న ప్రణవ్