
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ ఫిబ్రవరి 04: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈరోజు ఉదయం రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ కొక్కుల శ్వేత(30) మృతి చెందగా… మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) తెల్లవారుజామున తన క్వార్టర్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. తానాజీ స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామం. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే రోజు రెండు చోట్ల ఇద్దరు ఎస్ఐలు మృతి చెందడం పోలీసు వర్గాల తీవ్ర విషాదాన్ని కలిగించింది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ శ్వేత

