
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ లోనీ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ యాత్రకు వెళ్లిన విద్యార్థుల కోసం తమ వంతుగా రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని తాజా మాజీ ఎంపిపి రాణి సురేందర్ రెడ్డి అందజేసి ఆయన తన ఉదాహరణ చాటుకున్నారు. విద్యార్థులు విహారయాత్రలు చేయడం వల్ల ప్రపంచ జ్ఞానాన్ని అలవోకగా తెలుసుకోగలుగుతారని అందుకే విద్యార్థులు తరచుగా విహారయాత్రలు చేయాలని ఆయన సూచించారు.

