
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేటి యువకులు విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే మోసాల బారిన పడమని హుజురాబాద్ ఏ ఎస్ఐ కమల అన్నారు. ఆదివారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో యువకులకు సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అపరిచిత ఫోన్ కాల్స్ కు స్పందించరాదని దానివల్ల నష్టపోతామని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఎవరికీ మన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలియజేయరాదని ఆమె సూచించారు. ఏలాంటి అనుమానాలు ఉన్న పోలీసులను సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వినయ్, ధనుష్, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
