
–ఉపసంహారిoచుకోకపోతే ప్రజల మద్దతుతో పోస్టల్ సమ్మె ఉదృతం చేస్తాం… – రాష్ట్ర అధ్యక్షులు ఉకంటి మహేందర్ హెచ్చరిక.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కేంద్ర పోస్టల్ జాయింట్ కౌన్సిల్ అఫ్ యాక్షన్ నిర్ణయం మేరకు దశల వారి పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 18నుండి 20 వరకు మూడు రోజుల పాటు డిమాండ్ బ్యాడ్జ్ లను ధరించి దేశవ్యాపితంగా పోస్టల్ ఉద్యోగులు నిరసన తెలుపుతూ విధులకు హాజరు కావడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ఉకంటి మహేందర్ తెలిపారు. మూడో రోజు నిరసన కార్యక్రమం హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట పోస్టల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ లను ధరించి తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత పోస్టల్ ఉద్యోగుల సంఘం గ్రూప్ సి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ యు మహేందర్ మాట్లాడుతూ పోస్టల్ చట్టం 2023 వల్ల పోస్టల్ సేవలు ప్రైవేట్ – కార్పొరేట్ పరం కానున్నావని, పోస్టల్ చట్టం 2023 సెక్షన్ 9 మరియు సెక్షన్ 10 ప్రకారం ప్రజల గొప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముందన్నారు. ప్రజలకు జవాబు దారి తనంగా ఉన్న తపాలా వ్యవస్థను చట్టం లోని సెక్షన్ 10 ద్వారా తప్పించే ప్రయత్నం జరుగుతుందని అందుకే 150 సంవత్సరాలుగా ప్రజా సేవకే పేరొందిన వ్యవస్థను నిర్వీర్యం చేయడం హెయమైన చర్య అని చెప్పారు. అలాంటి చట్టాన్ని ఉపసంహారించుకునే వరకు పోరాటం చేయడమే అని, నమ్మకానికి మారుపేరైన పోస్టల్ వ్యవస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడమే ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్ అన్నారు. 8వ వేతన కమిటీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 1 జనవరి 2026నుండి అమలు చేయాలనీ, ఎన్ పిఎస్, యూపిఎస్ పెన్షన్ స్కీములను రద్దు చేసి ఓపిఎస్ పెన్షన్ ను యధావిధిగా పునరుద్దరణ చేయాలన్నారు. గ్రామీణ డాక్ సేవకులను రెగ్యులర్ ఉద్యోగులుగా హోదా కల్పించి పెన్షన్, గ్రాట్యుటీ, ఆరోగ్య పథకం వర్తింప చేయాలనీ ఈ డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే దశలవారి పోరాటం తర్వాత మార్చి 18 నుండి పోస్టల్ ఉద్యోగుల దేశవ్యాపిత నిరవధిక సమ్మె జరగబోతుందని తెలిపారు. తమ డిమాండ్ లను తీర్చాలని నిరవధిక సమ్మె జరిగితే ప్రజలకు పోస్టల్ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సి బ్రాంచ్ కార్యదర్శి జక్కు రజనీకాంత్, మాజీ కార్యదర్శి చందనాల గోపి కిషన్, బత్తిని రాజకుమార్, చిలుకమారి ప్రవీణ్, కోలా సందీప్, సామల వేణుగోపాల్, శివంసింగ్, గ్రూప్ డి డివిజన్ కార్యదర్శి బానోత్ తిరుపతి నాయక్, సంకటి హరీష్, గ్రామీణ డాక సేవక్ నాయకులు సతీష్, స్వామి, రాజేష్, శివాజీ, అపూర్వ పాల్గొన్నారు.

