
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కంటి సమస్యలు లేకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కంటి వెలుగు పరీక్షలు శనివారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొనసాగాయి. హుజురాబాద్ డివిజన్లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కంటి చూపు సమస్యలున్న పిల్లలకు అద్దాలను ఉచితంగా కంటి వెలుగు పథకం ద్వారా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో వైద్యాధికారులు సిబ్బంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు శనివారం వరకు సుమారు 450 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బి చందు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలతి, డాక్టర్ మొగిలి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
