
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 23: సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయిన వైనం శనివారం హుజురాబాద్ లో చోటుచేసుకుంది. ఈ మేరకు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ సభ్యుడు పర్లపల్లి విజయ్ కుమార్ తన పర్సనల్ పని మీద సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి వెళ్ళగా 12 గంటలకే తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. కనీసం ఫోన్ ద్వారా నైనా మా సమస్య చెప్పుకుందామని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిరోజు ఎంతోమంది నిరుపేద ప్రజలు, కార్మికులు వివిధ పనుల నిమిత్తం ఈ ఆఫీస్ కు వస్తూ ఉంటారని, కానీ ఇక్కడి అధికారులు మాత్రం 12 గంటలకు తాళాలు వేసుకొని వెళ్లిపోతే ఎట్లా అని అధికారులను ప్రశ్నించారు. పై విషయాన్ని పురస్కరించుకొని పై అధికారులకు ఫోన్ ద్వారా సంభాషించగా వారు మాట్లాడుతూ.. సదరు అధికారి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మేము కూడా పై విషయాన్ని పురస్కరించుకొని చర్యలు వేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదే విధంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన కార్మిక శాఖ అధికారులు దళారులకు లేదా బ్రోకర్ వ్యవస్థకు లేబర్ ఆఫీసర్ పెద్ద పీట వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారుగా ఈ కార్మిక శాఖ అధికారి పరిధిలో 2500కు పైచిలుకు కేసులను పెండింగ్లో ఉంటె బ్రోకర్ల ద్వారా ఒక పైలుకు సుమారుగా 3 వేల రూపాయలు ఇస్తే గాని పని చేయడం జరగధని, సామాన్య ప్రజలు వెళితే ఫైలు తీసుకొని సుమారు 9 నుండి 10 నెలలు తిప్పించుకొని మీరు ఇచ్చినటువంటి ఫైలు కనబడడం లేదని, మళ్లీ ఫైల్ ఇవ్వమని చెప్పడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారీ పైన ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు, ఇప్పటికైనా ఈ అధికారి పైన చర్యలు చేపట్టి ఇక్కడ నుండి బదిలీ చేయాలని, నిరుపేద ప్రజలకు అండగా నిలిచే అధికారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ పై విషయాన్ని పురస్కరించుకొని స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయం జిల్లా కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి తదితరుల దృష్టికి తీసుకెళ్లి ధర్నా రాస్తారోకోలతో పాటు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు వేస్తామని పలువురు బాధితులు డిమాండ్ చేశారు.



