
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం సింగాపురం వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాల లో ఈరోజు ప్రముఖ భారత శాస్త్రవేత్త, వైద్యుడు సర్ సివి రామన్ కనుకొన్న “రామన్ ఎఫెక్ట్ ” గౌరవార్థం, మనదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే (జాతీయ సైన్స్ దినోత్సవం) వి.వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సైన్స్ మన జీవితాలపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసేందుకు ఈ నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారని, ‘రామన్ ఎఫెక్ట్’ 1928 ఫిబ్రవరి 28వ తేదీన ఆవిష్కరణలోకి వచ్చినదని అధ్యాపకులు తెలిపారు. అందుకే ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని స్మరించుకునేందుకు ఈ రోజును సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని, విద్యార్థులు సైన్స్‌ను చదవడానికి, సైన్స్ రంగం పట్ల ఆసక్తిని పెంచుకోవాలనీ సూచించారు. ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్‌తో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుతుంటారని, ఈ 2025వ సంవత్సరంలో ”వికసిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్షిప్ కోసం భారతీయ యువతకు సాధికారత” థీమ్‌తో ఈ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారని వివరించారు. రామన్ ఎఫెక్ట్’ లేదా ‘రామన్ స్కాటరింగ్’ ప్రకారం.. ఒక కాంతి పుంజం పారదర్శక పదార్థం గుండా వెళ్ళినప్పుడు.. అది చెల్లాచెదురుగా వెళ్లి.. ఆ పదార్థం యొక్క పరమాణు నిర్మాణం గురించి సమాచారాన్ని వెల్లడిస్తుందన్నారు. ఈ ఆవిష్కరణ సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోవడానికి దారితీసిందని చెప్పారు. ఈ ఆవిష్కరణ తర్వాత భారత ప్రభుత్వం సి.వి రామన్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి.ఎన్ హనుమాకుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్విజ్ కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు శనిగరపు రజిత, చల్లురి సతీష్, తాల్లపెల్లీ అజయ్ కుమార్, సిద్ధమల్ల విజయ్, పోతీరెడ్డి హరీష్, భాస్కర్, మహేష్, సదయ్యా, రమాదేవి, విద్యార్థినిలు పాల్గొన్నారు.


