
–ముఖ్యమంత్రి,రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,మంత్రి పొన్నం, వోడితల ప్రణవ్, చిత్రపటాలకు క్షీరాభిషేకం...
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమైందని, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయింపులో భాగంగా బుధవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏనాడు బీసీలను, ఎస్సీ రిజర్వేషన్లను, పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే బిసి రిజర్వేషన్ కేటాయించిందని అన్నారు. ఒక బీసీలకే కాకుండా ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కేటాయించడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాలకు ప్రజా ప్రభుత్వం సమన్యాయం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోగానే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తూన్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలన్ని తూ.చా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ తో రాష్ట్రంలోని బీసీలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరు కిరణ్, మండలం మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పుల్ల రాధా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, కొలిపాక శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు లంక దాసరి లావణ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోల్లు బాబు, మహిళా పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, కడారి తిరుమల, మహిందర్ గౌడ్,
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదోడ్డి రాజు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రిబ్కా ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు ఏర్ర రవీందర్, ఎర్ర రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బిక్షపతి, తునికి రవి, దుబాషి బాబు, కిరణ్ రెడ్డి లోకిని రాజు, బండారు సదానందం, కూరపాటి రామచంద్రము మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.


