
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ ఇంటి పన్నుల వసూళ్ళలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్ధిక సంవత్సరంకు గాను 100 శాతం ఇంటి పన్నులు వసూళ్ళ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి శభాష్ కనిపించుకుంది. రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉండగా హుజురాబాద్ మొదటి స్థానంలో ఉండడడం గర్హనీయం. మున్సిపాలిటీలోని 30 వార్డులల్లో 8917 నివాసాలు ఉండగా రూ.2 కోట్ల 64 లక్షల బకాయిలు ఉన్నాయి. గత రెండు నెలల క్రితం బదిలీపై వచ్చిన కమిషనర్ కేంసారపు సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100 శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయడంలో సఫలీకృతులయ్యారు. 8917 నివాసాలకు గాను రూ.2 కోట్ల 64 లక్షలు వసూళ్ళు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పోలీస్ శాఖ నుండి రూ.5 లక్షల 41 వేలు, కోర్టు బిల్డింగ్ ల ద్వారా రూ.3 లక్షల 80 వేలు, ఎంపిడివో కార్యాలయం ద్వారా రూ.1 లక్షల18 వేలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1 లక్ష 18 వేలు, చెల్లింపు లు జరిగాయి. వంద శాతం పన్నులు వసూళ్ళు జరిగిందున, 15 వ ఆర్ధిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ కే సమ్మయ్య తెలిపారు. పట్టణ ప్రజలు 100 శాతం పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కృతజ్ఞతలు తెలిపారు.
థై బజార్ కు రూ.16 లక్షల 40 వేలు
హుజురాబాద్ మున్సిపల్ లో థై బజార్ బహిరంగ వేలం ద్వారా రూ.16 లక్షల 40 వేలు వేలం పాట ద్వారా నిధులు వచ్చినట్లు కమిషనర్ సమ్మయ్య తెలిపారు. బహిరంగ వేలంలో 5 గురు వ్యక్తులు పాల్గొనగా రామకృష్ణ అనే అతనికి వేలం ద్వారా పాట లో చేజిక్కించు కొన్నారు. గత సం రూ.15 లక్షల 55 వేలు రాగ ఈ సం రము, రూ.16 లక్షల 40 వేలు వచ్చాయి.
కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు..
హుజురాబాద్ మునిసిపల్ పన్నుల వస్తులలో తెలంగాణ రాష్ట్రంలోనే 100% వసూలుచేసి మొదటి స్థానంలో నిలిచినందుకు కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఉద్యోగులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు, కమిషనర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే కమిషనర్ పన్నుల వసూళ్లలో బాధ్యతగా విధులు నిర్వహించిన ఉద్యోగులను శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ సాంబరాజు, టిపిఓ, వార్డు ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.



కమిషనర్ సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డిని సత్కరిస్తున్న తాజా మాజీ ప్రజా ప్రతినిధులు..