
- పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ప్రణవ్.
- జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన ఇళ్ళందకుంట.
- అన్నదాన కార్యక్రమ నిర్వాహకులను అభినందించిన ప్రణవ్.
- కళ్యాణానికి వచ్చిన భక్తులకు మంత్రి పొన్నం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిక పంపిణీ.
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ఇల్లందకుంట. అపర భద్రాద్రిగా పేరొందిన ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని, కళ్యాణ మండపంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తుల రామనామస్మరణల మధ్య అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో రామయ్య తాలిబొట్టు కట్టారు.హుజురాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇళ్ళందకుంట ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆలయ కమిటీతో చర్చించి తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, నిధులు కేటాయిస్తామని తెలిపారు.
భక్తులకు ఉచిత మజ్జిక పంపిణీ..
కళ్యాణానికి వచ్చే భక్తులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో రిబ్బన్ కట్ చేసి ప్రణవ్ ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్నదాన కార్యక్రమం గొప్ప కార్యక్రమం
కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయడం పట్ల జమ్మికుంట రైస్ మిల్లర్ల, కాటన్ ఇండస్ట్రీస్, పారబాయిల్డ్ రైస్ మిల్లర్లను ఇతర దాతలను ప్రణవ్ అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు.


కళ్యాణ మండపంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్న ప్రణవ్ బాబు..


స్వామివారిని దర్శించుకుంటున్న ప్రణవ్ బాబు..

మజ్జిగ పంపిణీ చేస్తున్న ప్రణవ్..


భక్తులకు అన్నదానం చేస్తున్న ప్రణవ్..

మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రణవ్..