
– ఆట పాటలతో సందడి చేసిన విద్యార్థులు
. మంచి విద్య అందించడమే గోల్డెన్ స్కూల్ లక్ష్యం
. స్కూల్ కరస్పాండెంట్ కందుకూరి కార్తీక్ ప్రిన్సిపాల్ సుంకనపల్లి ప్రవీణ్ కుమార్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ (ఎల్కతుర్తి): మండల కేంద్రంలోని గోల్డెన్ స్మైల్ ప్లే స్కూల్ అన్యువల్ డే (సెలబ్రేషన్) వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు డ్యాన్స్ లతో సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కందుకూరి కార్తీక్ మాట్లాడుతూ గోల్డెన్ స్మైల్ ప్లే స్కూల్ ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులకు బోధించే విద్య మొదటి దశలోని తీర్చిదిద్ది ఉన్నతమైన చదువుల వైపు మళ్లించడమే మా గోల్డెన్ స్మైల్ ప్లే స్కూల్ లక్ష్యం అని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుంకనపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో వారి భవిష్యత్తును ఉన్నతమైన శిఖరాలుగా నిర్మించుకోవడానికి బాటలు వేయడమే నా స్కూల్ యొక్క ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఐశ్వర్య, అంకిత, స్రవంతి, చందన, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


