
Oplus_131072
– అంగన్వాడి కేంద్రాలు.. మహిళల ఆరోగ్యానికి వరాలు..
– ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, (వీణవంక)ఏప్రిల్ 19: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్-1, అంగన్వాడి సెంటర్ -2 లు సంయుక్తంగా కలిసి, అంగన్వాడి సెంటర్ -1లో శనివారం ఫ్రీ స్కూల్ మేళ కన్నుల పండుగగా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీణవంక సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి హాజరై మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడి ప్రీ స్కూల్ పిల్లల (3 నుండి 6 సంవత్సరాలు)అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, పుట్టిన బిడ్డ నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచిత పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని, కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, శ్రీమంతాలు, బర్త్‌డేలు చేయటం జరుగుతుందని,
అలాగే గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పోషకాహార లోపం లేకుండా గుడ్లు, పాలు, బాలామృతం, పోషక విలువలు కలిగిన భోజనం, కురుకురేలు అందిస్తూ, ఆరోగ్యవంతులుగా మారుస్తున్నామని తెలిపారు.,l ప్రీస్కూల్ పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరిగిందని, ప్రత్యేకించి ప్రీస్కూల్ పిల్లలకు అసెస్మెంట్ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలందరూ చురుకుగా తయారయ్యారని, పిల్లల్లో పోషకాహార నివారణకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అనారోగ్య సమస్యలకు కూడా ఆర్ బిఎస్ కే వారి సహకారంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలు గర్భిణీలకు, బాలింతలకు, ప్రీస్కూల్ పిల్లలకు వరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓ దాత అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రశాంత, సరిత, గర్భిణీలు, బాలింతలు, ఆయా సెంటర్ల ప్రీస్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
