
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల కేంద్రంలో ప్రపంచ సోషలిస్ట్ రాజ్య నిర్మాత కామ్రేడ్ వీఐ లెనిన్ 155వ జయంతి వేడుకల్ని హుజురాబాద్ సిపిఐ పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మర్రి వెంకటస్వామి హజరై వీఐ లెనిన్ చిత్ర పటానికి పూలమాల వేసి నీవాళులు అర్పించారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ వీఐ లెనిన్ అక్టోబర్ విప్లవ మహా నాయకుడని కొనియాడారు. అదేవిధంగా వీఐ లెనిన్ ప్రపథమ సోషలిస్ట్ రాజ్యనిర్మాత పేదవర్గాల కోసం అనుక్షణం తపించిన యొథులని, ప్రపంచ భావితరాలకు సోషలిజం వ్వవస్థపై నిరంతరం శ్రమించిన కృషివలుడని అన్నారు. శ్రామికవర్గ విప్లవం మొదలుకొని పెట్టుబడి దారి విధానాన్ని అంతమెందించేందుకు కార్మిక వర్గాలకు అనుగుణంగా రాజ్యం ఉండాలి పాటుపడిన ఒక బృహత్తరమైన శక్తి వీఐ లెనిన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పంజాల శ్రీనివాస్, గోవిందుల రవి, లంకదాసరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
