
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ (వీణవంక),ఏప్రిల్ 22: వీణవంక మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి చిరుతల రామాయణం నాటక ప్రదర్శనకై కళాకారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీణవంక గ్రామంలో చిరుతల రామాయణం నాటక ప్రదర్శన కొరకు 25 మంది కళాకారులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి సమావేశమై, నాటక ప్రదర్శనకు కోసం పాత్రలు, సన్నివేశాలకి, గురువుల ఆధ్వర్యంలో చిరుతల రామాయణం నాటక ప్రదర్శన చేయాలని, భక్తిశ్రద్ధలతో నెల రోజులు నేర్చుకున్న తర్వాత, జూన్ చివరి మాసంలో చిరుతల రామాయణం నాటిక ప్రదర్శన చేయాలని కళాకారులు చర్చించుకున్నారు. ఈ సమావేశంలో రాయిశెట్టి శ్రీనివాస్, కొమురయ్య, దుర్గయ్య, తాళ్లపల్లి మహేందర్, బత్తిని నరేష్ గౌడ్, ముద్దెర శ్రీనివాస్, మల్లెత్తుల సదానందం, గణేష్, కుమార్, రాజు, బొమ్మ శంకర్, తిరుపతి, దామోదర్, మహేందర్, దామోదర్, తిరుపతి, రాజు తదితర కళాకారులు పాల్గొన్నారు.
