
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ప్రజలకు మెరుగైన సేవలు బిఎస్ఎన్ఎల్ ద్వారా అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హుజురాబాద్ బిఎస్ఎన్ఎల్ డిఈ ఎస్.బిచ్చ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ను మరింత ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో టిసిఎస్ సహకారంతో సేవలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఏప్రిల్ మాసాన్ని కస్టమర్ సర్వీస్ నెలగా ప్రకటించిందని అన్నారు. వినియోగదారులు సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడే కాకుండా www.cfp.bsnl.co.in ద్వారా ఆన్ లైన్ లో తమ ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. ఫోర్ జి సర్వీసులను ఆత్మనిర్బర భారత్ పథకం కింద అతి త్వరలోనే 5 జీ సర్వీసులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు జూన్ లోగా ఇది ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు భారతీయ టెక్నాలజీ ఉపయోగించి సి డాట్ ద్వారా ప్రజలకు మొబైల్ సర్వీసులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు కొన్ని సమస్యలను గుర్తించి టిప్ పద్ధతి ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని అన్నారు. వినియోగదారులు ప్రైవేట్ సర్వీసుల కన్నా మెరుగైన సేవలు కోసం బిఎస్ఎన్ఎల్ సిమ్ములను తీసుకోవాలని ఇంతే కాకుండా వైఫై సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నట్లు అని తెలిపారు. ఈ సమావేశంలో ఏవో ఎస్ ఉపేందర్, ఎస్ డిఈ ఆర్ సంతోష్, నవీన్, బాబు, విజయచందర్, విష్ణు ప్రసాద్, జి.టి.ఓ కిషన్, రాజు, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ బిఎస్ఎన్ఎల్ డిఈ ఎస్.బిచ్చ