
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరలలో ఉత్తమ ఫలితాలు సాధించిన హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు పుష్ప గుచ్చములు అందించి అభినందించారు. ఈ సందర్భముగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల పదవ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువులకు మన హుజురాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీ పిల్లలను చేర్పించండి, అన్ని వసతులతో మీ పిల్లలకు చక్కని బోధన అందించి ఉత్తమ ఫలితాలతో పాటుగా ఉన్నత స్థాయిలో ఉండే విధముగా మీ పిల్లలను తీర్చిదిద్దుతాము అని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు సాధించి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరంలో ఎంపీసీ నుండి రాష్ట్రస్థాయి మార్కులను సాధించిన కే అభిరామ్ 463/470, బి శ్రావణి 446/470 , పీ అభిరామ్ 443/470, ఆర్ వర్షిత 416/470 లను, బైపిసి నుండి జే మాధవి 379/440 లను సిఇసి లో పి అర్చన 386/500 అదేవిధంగా HEC లో టీ అఖిల 400/500 లను, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ నుండి కె సిరి చందన 879/1000, బైపిసి నుండి జార మరియం 873/1000, CEC నుండి ఎం లక్ష్మణ్ 586/1000 మరియు HEC నుండి ఎం రామ్ చరణ్ 928/1000 అత్యధిక మార్కులు సాధింవారన్నారు. అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సరం టాపర్లు :
కె ఆశిష్ కుమార్ CT నుండి 395,
ఆర్ అభినయ్ Fisheris నుండి 389
జి మణికంఠ E&CT నుండీ 375
ఏం జస్వంత్ ET నుండి 341
ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం పేపర్లు:
బి రమేష్ CT నుండి 792
సిహెచ్ వెంకటేష్ Fisheris నుండి 896
పి అజయ్ E&CT నుండీ 666
టి వెంకటేష్ ET నుండి 780 అత్యధిక మార్కులు సాధించిన వారు వీరందరికీ పుష్ప గుచ్చములతో అభినందించి, sweets అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తులసీదాసు, వాసుదేవరావు, విజేందర్ రెడ్డి, రాజశేఖర్, మల్లా రెడ్డి, సురేష్, వెంకటరమణ, మురళి మోహన్, రజిత, శైలజ, సుహాసిని, రేణుక , జ్యోతి,రజనీ,రాజేందర్, రాగమయి, రామరాజు, వనమాల అభినందించడం జరిగింది.

ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలుపుతున్న ప్రిన్సిపల్ ఆంజనేయరావు

ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందిస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు..