
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: సంచలనాత్మక ఫలితాలకు నిర్వచనం అల్ఫోర్స్ విద్యా సంస్థలని అధినేత డా.వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లి లోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చెందిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు రావడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష ఏదైనా ఫలితం ఏదైనా అగ్రస్థానం అల్ఫోరేనని మరోసారి నిరూపించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వార్షిక ప్రణాళిక ప్రారంభంలోనే పలు సూచనలను ఇవ్వడం జరుగుతుందని ఆ సూచనలను కఠినంగా అమలుపరిచి విద్యార్థుల్లో విజయ రహస్యాన్ని పెంపొందిస్తామని ఆయన తెలిపారు.
ఈ క్రమంలో ఈరోజు విడుదల చేసిన యస్.యస్.సి ఫలితాలలో పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులతో మన విజయం సాధించారని తెలుపుతూ బి. సాత్విక్ 589, ఎ. విష్ణుప్రియ, కె.శివరాణి, 588, కె. ఐశ్వర్య 587, యన్. సాత్విక్, ఎ. అన్విత్ 586.వి. అక్షర, జి. సహస్ర, సిహెచ్ ఆశ్రయ, టి. చరన్కుమార్ వి. అక్షర 585, టి. అక్షర, జి.శ్రీమేదా, వి.శివచరణ్, పి. గణేశ్, యస్. మధుశాలిని, కె. వినయ్ 584, ఎన్.నేహా, టి. నిత్య, జి. అఖిలా రెడ్డి, కె. ప్రణయ్, పి.అఖిల్ రావు 583, జి.సహజ 582, డి. విశ్వతేజ, కె. శోభన, కె.అలియా, యం.హర్షి, జి. ఐశ్వర్య, టి. కిషోర్ 581, యం. శృతకీర్తి, యం.డి. ముఖీత్, అర్. మౌనిమా, కె. సహస్ర రెడ్డి, వి. బృహతి, ఎ. రంజిత్ రెడ్డి. కె. సుకృతి 580 మరియు తదితర విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఘనవిజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు.
1140 విద్యార్థులకు గాను 861 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని 35 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా, 110 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా మరియు 341 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించారని చెప్పారు.
రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు గాను విద్యార్థులను, అల్ఫోర్స్ విద్యా సంస్థలను అగ్రభాగాన నిలిపినందుకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ పుష్పగుచ్చాలతో పాటు స్కోరు కార్డ్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తున్న ఆల్ఫోర్స్ అధినేత విఎన్ఆర్