
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రోగుల పట్ల నర్సులు చేసే సేవలు అమోఘమని డాక్టర్ మోడెపు శ్రీకర్ ఎండి జనరల్ ఫిజీషియన్, డయబెటలాజిస్ట్ అన్నారు. సోమవారం నర్సుల దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ లోని శ్రీరామ హాస్పిటల్ లో నర్సులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎటువంటి రోగులకైనా నర్సులు మానవతా దృక్పధంతో సేవలు అందిస్తారని కొనియాడారు. నర్సులు లేనిదే ఆసుపత్రి మనుగడ సాధ్యం కాదని ఆయన అన్నారు. రోగులను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారికి సేవలందిస్తారని, వారి ఆరోగ్యం మెరుగు పడేందుకు దోహద పడతారని చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మేనేజ్మెంట్ సభ్యులు నంబి భరణికుమార్, ముష్కే శ్రీనివాస్, సిస్టర్స్ దీపికా, సునీత, ఐషు, అంజలి, శిరీష, ల్యాబ్ టెక్నీషియన్లు నిఖిల్, సతీష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
