
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు కొన్ని ప్రాంతాలలో కొన్ని సంవత్సరాల నుండి వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ అధికారులు లేక కిందిస్థాయి అధికారులను వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ ఇన్చార్జిలు ఇచ్చి కొన్ని సంవత్సరాలుగా ఇలాగనే వారే కొనసాగుతున్నారనీ కావున పై స్థాయి అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇచ్చి ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వివిధ డివిజన్లలో జాయింట్ కమిషనర్ అధికారులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కే హరిత లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ టిసిటిఎన్జీవో సంఘం పక్షాన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోన్లలో వాణిజ్య పన్నుల శాఖ నూతన జాయింట్ కమిషనర్ కార్యాలయంను వెంటనే స్థాపించాలి..
– తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, రెవెన్యూ వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి, వాణిజ్య పన్నుల అధికారులు శాఖ కమిషనర్ కే హరిత లకు విజ్ఞప్తి.
సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నుండి విడిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనలను ఏర్పాటు చేసిన ప్రాంతాలలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల కార్యాలయాలను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరి చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల కార్యాలయాలను కొన్ని ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుందనీ, ఎందుకంటే ఒక జోన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సర్కిల్ కరీంనగర్ జాయింట్ కమిషనర్ పరిధిలో మరి కొంతమంది సర్కిల్ వరంగల్ జాయింట్ కమిషనర్ పరిధిలో మరికొన్ని సర్కిల్ ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ ప్రాంతాలలో రావటం వలన ఆయా ప్రాంతాలలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల సీనియారిటీ గురించి ఉద్యోగులు కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎందుకంటే మా జోన్ లో జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయము లేకపోవడం వలన మేము మూడు జాయింట్ కమిషనర్ కార్యాలయల చుట్టూ తిరగటం జరుగుతుందన్నారు. కనుక మన ప్రాంతాలలో కొత్త జోన్లలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల అధికారులు శాఖ కార్యాలయాలను వెంటనే స్థాపించాలని ఆ జోన్లకు సంబంధించిన ఉద్యోగులు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ దృష్టికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ మీయొక్క సమస్యలను మా సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కే హరిత దృష్టికి కూడా సంఘం ద్వారా మీ సమస్యలను తీసుకొని వెళ్తానని ఉద్యోగులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి బిక్షపతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ అఖిల్ తోపాటు వి సంతోష్ కుమార్, రాజు, వీర్, కె శ్రీకాంత్, ఎం భరత్, షేక్ ముబీన్, ఎం బాలాజీ, ఎస్ ప్రణయ్, ఎం వంబిష్, కిరణ్, చందా చౌదరి, మహమ్మద్ ఆరిఫ్, దయానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ను సన్మానిస్తున్న తోటి ఉద్యోగ సంఘం నాయకులు.