
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,జూలై4:
సికింద్రాబాద్‌లోని రైల్వే గ్రౌండ్ లో జూనియర్ బాలికలు, బాలుర నేషనల్ హాకీ సెలెక్షన్ ట్రయల్స్ జూలై 6న ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ తిరునాహరి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ట్రయల్స్ కోసం కరీంనగర్ జిల్లా హాకీ క్రీడాకారులు తమ పేర్లు జిల్లా ఇన్చార్జ్ సెక్రటరీ మహమ్మద్ తారీక్ అలీ వద్ద నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సెలెక్షన్ ట్రయల్స్‌కు 01 జనవరి 2006 లేదా ఆ తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులన్నారు. ట్రయల్స్‌కు హాజరవ్వనున్న క్రీడాకారులు తప్పనిసరిగా హాకీ ఇండియా ఐడి కార్డు, ఆధార్ కార్డు, జననా ధృవీకరణ పత్రం ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావలసి ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు ట్రయల్స్ ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ముందుగానే తమ హాజరు(పేరు) ఖరారు చేసుకోవాలని సూచించారు. సమాచారం కోసం సెల్ నెంబర్లు : 70756 67465, 99490 29440 లలో సంప్రదించాలన్నారు.

హాకీ క్రీడాకారుల సెలక్షన్ జరుగు స్థలము సికింద్రాబాద్‌లో….
——————+++++++————————
#పత్రికా ప్రకటనలు(యాడ్స్)&
——————-+++++++————————
