
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం కన్నుమూత..! ఈరోజు తెల్లవారుజామున చివరిశ్వాస వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వయస్సు 94ఏళ్ళు..! విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ ముంబై నుండి బయలుదేరి ఇంటికి చేరారు. ఆమె అల్లుడు మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలోనీ హిందూ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భర్త రామలింగయ్యతో కనకరత్నం (ఫైల్ ఫోటో)





