Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శివాజీ యూత్ దుర్గామాత మండపం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా ఖడ్గం, త్రిశూళ్ లకు ప్రత్యేక పూజ నిర్వహించారు. పూజ అనంతరం జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి, జిల్లా గోరక్ష ప్రముక్ రావుల అనిల్ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపం యూత్ సభ్యులు దాసరి రాజేందర్ రెడ్డి, రాజేష్, రఘు, అశోక్, భరత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






