
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని సబ్ స్టేషన్ 132 కేవి సబ్ స్టేషన్ లో విద్యుత్ షాక్ తో ఆర్టీజియన్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ఆపరేటర్ ఉద్యోగి బోడ శంకర్ రెడ్డి(40) మృతి చెందారు. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఆయన సబ్ స్టేషన్(బోర్ణపల్లి) లో విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే సబ్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉద్యోగి దుర్మరణం చెందారనీ స్థానిక ఉద్యోగులు తెలుపుతుండగా విద్యుత్ అధికారుల నీర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
:

విద్యుత్ షాక్ తో మృతి చెందిన శంకర్ రెడ్డి..

బోడ శంకర్ రెడ్డి (ఫైల్ ఫోటో)





