
–స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ,బిఆర్ఎస్ బీసీ డిక్లరేషన్ పట్ల ద్వంద్వ వైఖరి
–నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు.
–కులగణన, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విజయవంతంగా పూర్తి చేశాం.
–బీసీలను మోసం చేస్తున్న పార్టీలు బీజేపీ,బీఆర్ఎస్.
–ప్రభుత్వ పథకాలే మాకు ప్రాధాన్యం.
.మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, కామారెడ్డి డిక్లేరేషన్ లో చెప్పినట్టు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ లోని 5 ఎంపీపీ, 5 జడ్పీటీసీ స్థానాలు, గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను గెలుచుకుంటామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దుర్గామాత ఆశీర్వాదం వలన ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.పదేళ్ల బిఆర్ఎస్, బీజేపీ పాలనకు 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, 20 నెలల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, సన్నబియ్యం, రైతులకు రుణమాఫీ, 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమచేశామని ఇది ప్రజా ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ,బిఆర్ఎస్ బీసీ డిక్లరేషన్ పట్ల ద్వంద్వ వైఖరి బయటపడుతుందని బయటికి మద్దతు ప్రకటిస్తూనే లోపయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నా కూడా, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు గురించి మాట్లాడి ఎందుకు ఆమోదించడంలేదని ప్రశ్నించారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా రిజర్వేషన్ పెంచలేదని అన్నారు. ఇప్పుడు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందని ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. స్థానిక పోరులో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీగా,విప్ గా,ఎమ్మెల్యేగా హుజురాబాద్ కి కౌశిక్ రెడ్డి చేసింది శూన్యం..
పార్టీ ఇంచార్జిగా తాను హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పానని,దానికి అనుకూలంగా ఎస్డిఎఫ్ నిధులతో ప్రిసైడింగ్ కాపీలు ఇచ్చామని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరో 15కోట్లు మంజూరు చేపించామని, ఆ నిధుల ద్వారా పట్టణాల్లోని సీసీ రోడ్, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి శ్రీకారం చూపెడుతామని అన్నారు. ఉప ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి చేసింది, తీసుకొచ్చింది సున్నా అని, ఏం నిధులు తీసుకొచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇయ్యందనుకు, రేషన్ కార్డు ఇయ్యనందుకు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు?
ప్రజా పాలనలో ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ నాయకులపై ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా అభివృద్ధి దిశగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఇంటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని, వాటి అమలులే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రక్ష అని ప్రణవ్ అన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజా పాలనను మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రణవ్ తెలిపారు.





విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేపిచ్చినట్లు చూపెడుతున్న మంజూరి పత్రాలు..
—————-++++++++——————
&&లోకల్ యాడ్స్ &&
——————-++++++++————-
##దసరా శుభాకాంక్షలు##








