
:మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, అక్టోబర్ 1: హుజూరాబాద్ విద్యుత్తు సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆర్టీజిన్ కార్మికుడు బోడ శంకర్ రెడ్డి(40) మృతికి ఏఈ నే కారణమని, మద్యం తాగి విధులు ఏఈ నిర్వహించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజిఎన్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శంకర్ రెడ్డి మృతి చెందిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ ఎల్ సి తీసుకున్నట్లు రికార్డు కూడా రాయకుండానే ఏఈ నిర్లక్ష్యం చేయడంతోనే శంకర్ రెడ్డి మృత్యువాత పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ సమక్షంలో పోలీస్ స్టేషన్లో డ్రంక్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని పేర్కొన్నారు. విద్యుత్ యజమాన్యం ఆర్టిజిఎన్ కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి అవలంబిస్తుండడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఏఈ చేసిన తప్పు ఒప్పుకొని రూ.17 లక్షల పరిహారం కింద శంకర్ రెడ్డి కుటుంబానికి సహాయం చేస్తానని ఒప్పుకున్నాడని తెలిపారు. ఒకవేళ అతను ఇవ్వకపోతే రాష్ట్రంలోని 20,000 మంది ఆర్టిజిఎన్ కార్మికులు ఏఈ ఇంటి ముందట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. యజమాన్యం తగు జాగ్రత్తలు ఇప్పటికైనా తీసుకొని ఆర్టీజియన్ కార్మికుల ప్రాణాలు పోకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజిన్ జేఏసీ నాయకులు కందికొండ వెంకటేష్, పురుమళ్ళ సంతోష్, ఉట్ల ప్రభుదాస్, రామంచ రవి, రాజు తదితరులు ఉన్నారు

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టిజెన్స్ జేఏసీ నాయకులు..

132/ 33 కెవి సబ్ స్టేషన్ వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు
—————–+++++++++—————
&&లోకల్ యాడ్స్ &&
————–+++++++————–
##దసరా శుభాకాంక్షలు##

&&దేవి ఎంటర్ప్రైజెస్ వారి దసరా శుభాకాంక్షలు &&

@@విహెచ్పి వారి దసరా శుభాకాంక్షలు@@

&& పిఎసిఎస్ వారి దసరా శుభాకాంక్షలు&&





