
– పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న.
— అశోక్ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ ఏఎంసి డైరెక్టర్.. మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి నరసింహారెడ్డి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 10: హుజురాబాద్ పట్టణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా ఎన్నికైన వన్నాల శివాజీకి ఘన సన్మానం స్థానిక హుజురాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికై ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా వన్నాల శివాజీకి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. ఉపసర్పంచ్ గానే కాక ముందు ముందు మరెన్నో పదవులను అధిరోహించాలని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారంకై ఎప్పటికప్పుడు తన సేవలను అందిస్తూ, ప్రజల ఆధర అభిమానాలను చురగోణాలని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ జేఏసీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు వెంకన్న, వేముల అశోక్ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ ఏఎంసి డైరెక్టర్, బండారి సదానందం, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి నరసింహారెడ్డి, పూలే కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, వడ్లకొండ అనిల్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గరవేణి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీనీ సన్మానిస్తున్న బీసీ జేఏసీ అధ్యక్షులు తదితరులు..
ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ







