Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతానికి 2కిలో మీటర్ల దూరంలోని సిర్సపల్లి గ్రామ సరిహద్దులో పచ్చని పొలాల హైవే ప్రక్కన నిర్మించ తలపెట్టిన వేస్టు టు ఎనర్జీ డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేస్తూ అధికారిక ప్రకటన చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్ధానిక శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి వేలాది మందితో మంగళవారం చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకులతో కలిసి పోలాడి రామారావు సందర్శించి పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపి మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాల చెత్తను తరలించడానికి మధ్యలో ఉన్న హుజురాబాద్ ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్సఫర్ డిబిఎఫ్ఓటి పద్ధతిలో డంప్ యార్డ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పజెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా 25 ఏళ్ల క్రితం జవహర్ నగర్లో నిర్మించిన రాంకీ సంస్థకు అప్పజెప్పడం అధికార ప్రజా ప్రతినిధుల ప్రమేయం తోనే జరిగిందని ధ్వజమెత్తారు.
ఇప్పటికే జవహర్ నగర్లో ఈ రాంకీ సంస్థ నిర్మించిన డంప్ యార్డ్ వాళ్ళ అక్కడి వేలాది మందికి అనారోగ్య కారణాల వల్ల మంచం పట్టి రోగాల వినికిడి సమస్యలతో అవస్థల పాలై జీవచ్చవాళ్ళ పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చెందారు. ఇట్టి డంప్ యార్డ్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వంలో కనీస చలనం లేదని చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్షతో నేడు వేలాది మంది ప్రజల నినాదాలతో తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలతో హోరెత్తించారని వేలాది మంది మహిళలు పాల్గొన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డు నిర్మాణాన్ని తక్షణమే నిలిపి వేస్తూ అధికారికంగా ప్రకటించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కాలయాపన చేస్తే మూల్యం చెల్లించక తప్పదని ప్రభుత్వాన్ని స్తంభింప జేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ సంస్థతో కాకుండా ప్రభుత్వమే జపాన్ లో నిర్మించినట్లుగా ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండే విధంగా జనావాసాలకు దూరంగా నిర్మించాలని రామారావు డిమాండ్ చేశారు. కమిషన్ ల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం నాయకుడు ఎడవెల్లి కొండాలరెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్యే 24 గంటలు నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





