
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల సంక్షేమం ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం ఆ ఆలోచన మరచి డంపింగ్ యార్డును ఏర్పాటు చేసిందని, దానిని ప్రజలు పోరాటం చేయడం ద్వారా అడ్డుకుందామని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు 18 రోజులకు చేరుకున్నాయి. లారీ అసోసియేషన్ సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కరీంనగర్ వరంగల్ నగరాల చెత్తతో పాటు తొమ్మిది మున్సిపాలిటీల చెత్తను హుజురాబాద్ లో వేయడానికి డంపింగ్ యార్డ్ మంజూరు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు.


మాట్లాడుతున్న బిజెపి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు..
తెలంగాణ పోరాటాలకు అడ్డా అని అలాంటి పోరాటాల కు నిలయమైన కరీంనగర్ హుజురాబాద్లలో ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం పూనుకుంటే ప్రజలు ఎలా పోరాటం చేసి సాధిస్తారో మరోసారి ప్రభుత్వానికి తెలియచెప్పాలని అన్నారు. ప్రజల సంక్షేమం కాకుండా వ్యాపారస్తుల ప్రయోజనాల గురించి ప్రభుత్వం ఆలోచిస్తే ప్రజలు తిరగబడతారు అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు ప్రజలు చేస్తున్న నిరసనలకు తాను మద్దతు ఇస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు రాజయ్య, సలీం, సాదిక్, అఖిలపక్ష నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, గుడిపాటి జయపాల్ రెడ్డి, కట్కూరు మల్లారెడ్డి, పోల్సాని రామారావు, కిషన్ రెడ్డి, వెంకట్రావు, హనుమంతరావు, చందుపట్ల జనార్ధన్, వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.





