
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హుజరాబాద్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రచార వాహనాన్ని శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని జండా ఊపి ప్రారంభించారు. వాడవాడనా, పల్లె పల్లె నా తిరిగి అంబేద్కర్ ఆశయాలను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని వివరించడం జరుగుతుందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు జయంతోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు ఇల్లందుల సమ్మయ్య, బోరగాల మొగిలి, కాలిక్ హుస్సేన్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆడెపు సురేందర్, బాబు జగ్జీవన్ రావ్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మట్టెడ ప్రకాష్, పూలే జయంతోత్సవ కమిటీ చైర్మన్ రఘు చారి, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు చౌడమల్ల సారయ్య, ఆలేటి రవీందర్, తునికి సమ్మయ్య, తునికి వసంత్, మారేపల్లి శ్రీనివాస్, వేల్పుల రత్నం, ప్రధాన కార్యదర్శి యేముల పుష్పలత, బత్తుల రాజలింగం, దేవునూరి రవీందర్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం, మేకల రవీందర్, చందుపట్ల జనార్ధన్, ఎర్ర రాజు, తాళ్లపల్లి రమేష్, సందెల వెంకన్న, రామ్ సారయ్య, మొలుగూరి మొగిలయ్య, మేకల మల్లేష్ పాల్గొన్నారు.

ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..





