
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్నదాతల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో ఈనెల 28 న కరీంనగర్ లో రైతు మహాగర్జన సమరభేరి సమర భేరి సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. శుక్రవారం హైదారాబాద్ లోని హిమాయత్ నగర్లో రాష్ట్ర ప్రజా సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమరభేరి సభ విజయవంతం చేయడానికి ఏర్పాట్లపై వివిధ జిల్లాల బాద్యులతో సమీక్షించారు.



మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి రైతు మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో కలిసి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందించి ఎంపీ రఘునందన్ రావుతో గోడ ప్రతులను ఆవిష్కరింఫజేసిన రామారావు…
బీజేపీ ఆఫీసులో రైతుల మహాగర్జనకు రావాలని ఆహ్వానిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి తూళ్ళ వీరేంద్ర గౌడ్, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గణేష్ కుండే, మాజీ అధ్యక్షుడు సెవెల్ల మహేందర్, నాయకులు చిత్తరంజన్ రెడ్డి, సుధీంద్ర చౌదరిలకు ఆహ్వాన పత్రికలను ఇచ్చి వారిచే గోడ ప్రతులను ఆవిష్కరింప జేసిన రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
అంతకు ముందు మెదక్ ఎంపీ రఘునందన్ రావును నగరంలో వారి నివాసంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రథాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ భవన్ లో, బీజేపీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి తూళ్ల వీరేంద్రగౌడ్ ను, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గణేష్ లను బిజెపి కార్యాలయంలో ఆహ్వాన పత్రాలను అందజేసి సమరభేరి సభకు మద్దతు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించి గర్జన గోడ ప్రతులను ఎంపీ రఘునందన్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, వీరేంద్రగౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ఎదుట రైతు విభాగం నాయకులు రమేష్, రాజేశ్వర్ రావులు వేర్వేరుగా ఆవిష్కరించారు. పాలకులు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఋణ మాఫీ 30 శాతం మంది రైతులకే జరిగిందని మిగతా 70 శాతం మందికి వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారుకౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓసి కార్పొరేషన్లకు పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకలకే పరిమితం చేయడం సరి కాదన్నారు. ఓ పరిశ్రమ యజమాని తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయిస్తున్నాడని అదే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతుల న్యాయమైన డిమాండ్లను ఇతర సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈనెల 28న ఓసి ఐకాస ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. సమావేశంలో రైతు ప్రజా సంఘాల జాతీయ ఉపాధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రథాన కార్యదర్శి శ్రీహరిరావు, నాయకులు మూగ జయశ్రీ, చిత్తరంజన్ రెడ్డి, సుధీంద్ర చౌదరి, రమేష్, రాజేశ్వర్ రావు, స్వామి తదితరులు ఉన్నారు.

తెలంగాణా భవన్ ఎదుట బీఆర్ఎస్ ప్రథాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రైతు మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పలికిన పోలాడి రామారావు.






