
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో శనివారం జాతీయ డెంగ్యూ అవగాహన ర్యాలీని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో హుజూరాబాద్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి పంచాయతీ సిబ్బందితో కలిసి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ దోమల నివారణ చర్యలు దోమలు పుట్టకుండా మురికినీరు వారి ఇంటి ఆవరణలో ఆగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేంద్ర రాజు, హెల్త్ అసిస్టెంట్ సత్యం, పలువురు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ డెంగ్యూ అవగాహన ర్యాలీ తీస్తున్న వైద్య సిబ్బంది.

డ్రై డే పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న డిప్యూటీ డిఎం హెచ్ వో శ్రవణ్ కుమార్…





