
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాలను పురస్కరించుకొని గ్రామంలో గౌడ కులస్తులు తమ ఇళ్ళను చక్కగా అలంకరించుకున్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పోచమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలను, గ్రామాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, మహిళలు పాల్గొన్నారు.

నెత్తిన బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేందుకు వెళ్తున్న గ్రామస్తులు..

పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్న గ్రామస్తులు..





