
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదల కోసం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు మంగళవారం హుజరాబాద్ లో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకులు, కదిరే రమేష్, ప్రతాప శ్రీనివాస్, ఇమ్మడి దేవయ్య, రాసపల్లి శంకర్, గుర్రం నాగరాజు, అందేసి రవి, మాట్ల చిరంజీవి, మల్ల మరి రవి, ప్రభు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల గురించి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు..






