Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను రీ సర్వే చేయడం ద్వారా అర్హులైన వారికి ఇవ్వాలని మూడో వార్డు కౌన్సిలర్ గందె శ్రీనివాస్, బి.ఆర్.ఎస్. నాయకుడు ప్రతాప తిరుమల్ రెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ బి కిషన్ కు డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపుపై అర్హులైన వారికి ఇవ్వాలని కోరుతూ వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…హుజూరాబాద్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో జరుగుతున్న లోపాలను సరిదిద్ది వెంటనే ఇండ్లు పంపిణి చేయాలని అన్నారు. నిజమైన అర్హులకు ఇళ్లు అందకుండా, ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారికి లేదా ఒకే కుటుంబానికి చెందిన పలువురికి ఇండ్లు కేటాయించడం బాధాకరమన్నారు. ముఖ్యంగా అనాథలు, వికలాంగులు, వితంతువులు వంటి నిరుపేద వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా మళ్లీ సర్వే నిర్వహించి పారదర్శకంగా ఇండ్లను కేటాయించాలని కోరారు. ప్రజలలో అనుమానాలు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేస్తున్న కౌన్సిలర్ గందె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్, బిఆర్ఎస్ నాయకుడు తిరుమల్ రెడ్డి..





