
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, మే 21: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించి, నదికి ప్రత్యేక పూజలు చేశారు. కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.




