
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళితుల్లో చైతన్యం నింపిన ఎం.వి భాగ్యరెడ్డివర్మ జయంతి వేడుకలు శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసినీ రొంటాల, కమిషనర్ బి కిషన్, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, వార్డు అధికారి ఎస్. శ్రీకాంత్ మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ కిషన్, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు..






