ఐపీఎల్ అభిమానులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది చెప్పింది. ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. రేపు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ మధ్య మ్యాచ్ జjరగనుంది. దానిని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. మే 16న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్య వీటిని నడపనుంది. దీనిని క్రికెట్ అభిమానుడు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
