
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. జూన్ 1న కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.