మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ను జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న మర్యాద పూర్వకంగా కలిశారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని 30 వార్డులలో పలు అభివృద్ధి పనుల గురించి అడుగగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సానుకూలంగా స్పందించారనీ తెలిపారు.
