గుండెపోటుతో రంగస్థలం నటుడు మృతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్డ మండలం పెద్దపాపయ్యపల్లె గ్రామానికి చెందిన రంగస్థల నటుడు, సీనియర్ కళాకారుడు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి (68) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా శివరామకృష్ణ భజన మండలి స్థాపించి ఎంతోమంది కళాకారులను తయారు చేశారు అలాగే హుజురాబాదులో నటరాజ కళాకారుల సంక్షేమ సంఘం స్థాపించి దానికి అధ్యక్షునిగా కూడా పనిచేశారు. శ్రీనివాస్ రెడ్డి సాంఘిక పౌరాణిక రంగస్థలం కళాకారునిగా హుజురాబాద్ ప్రాంతంలోనే గాక రాష్ట్రస్థాయిలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో అక్షర ఉజ్వల, అక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎన్నో రకాల నాటకాలతో ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యం కలిగించిన గొప్ప నటుడు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతి పట్ల గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ లతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, రంగస్థల కళాకారులు, సీనియర్ కళాకారులు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.