
స్వర్ణోదయం ప్రతినిధి, ఖమ్మం:
ఖమ్మం జిల్లా రూరల్ మండలం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా దుర్మార్గం చల్లడం తీవ్ర కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రూరల్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఎలా ఉన్నాయి. శనివారం ఉదయం సదరు మహిళ కొణిజర్ల నుండి ఖమ్మం వెల్లే క్రమంలో బస్సు ఎక్కి ఫుట్ బోర్డుపై నిలబడి ఉండగా కాలుజారి ఆమె ప్రయాణిస్తున్న బస్సు కింద పడి మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనుకోకుండా ఆర్టీసీ బస్సు కిందపడి మహిళా మృతి చెందడం కొనిజర్ల మండలంలో పలువురిని కలచివేసింది.