
- జమ్మికుంట బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట:
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణ వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనీ, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రూ.500 బోనస్ ప్రకటించాలని బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు త్వరగా జరగకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతున్న నేటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల సమీక్ష లేదన్నారు. చిత్తశుద్ధి అంతకన్న లేకపోవడంతో ఈరోజున మొక్కజొన్న మరియు వడ్ల కొనుగోలు సెంటర్ కు వెళ్లి తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ఎలాంటి కటింగ్ లు లేకుండా తడిదాన్యం కొనుగోలు చేసి క్వింటాలుకు 500/-రూ”ల బోనస్ ప్రకటించి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, కోర రవీందర్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, మోతే స్వామి, అప్పం మధు యాదవ్, ఇటికల స్వరూప, ఎద్దుల పురం అశోక్, మేక సుధాకర్ రెడ్డి, కొమ్ము అశోక్, రావుల శ్రీనివాస్, ఠాగూర్ రాకేష్, మోడం రాజు, ఉడుగుల మహేందర్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, సమ్మిరెడ్డి, ఎర్ర వెంకటేష్, ఏ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.