
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇంటితో పాటు ఏకకాలంలో ఆయనకు సంబంధించిన 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సాహితి ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సదరు ఇన్ఫ్రా కంపెనీ నుండి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఏసీబీ సోదాలకు పునుకున్నట్లు తెలిసింది. సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.